ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ నేత బార్‌లో 1.3 కోట్ల మద్యం సీజ్‌

ABN, Publish Date - Apr 26 , 2024 | 04:24 AM

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల మద్యం డంపుల పుట్ట పగులుతోంది. రెండ్రోజుల క్రితం ముత్తుకూరు, పొదలకూరు మండలాల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అల్లూరులోని ఓ బార్‌పై దాడులు నిర్వహించి రూ.1.3 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్‌ చేశారు.

నెల్లూరు జిల్లా అల్లూరులో గుర్తింపు

అల్లూరు, ఏప్రిల్‌ 25 : నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల మద్యం డంపుల పుట్ట పగులుతోంది. రెండ్రోజుల క్రితం ముత్తుకూరు, పొదలకూరు మండలాల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అల్లూరులోని ఓ బార్‌పై దాడులు నిర్వహించి రూ.1.3 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్‌ చేశారు. ఈ బార్‌ అధికార పార్టీకి చెందిన నాయకుడిది కావడంతో కలకలం రేగుతోంది. ముందుగా బుధవారం రాత్రి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీల్లో ఈ బారుకు సమీపంలో 272 మద్యం సీసాలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇస్కపల్లికి చెందిన కొండూరు శ్రీనివాసులు, యల్లంగారి పార్వతయ్యలను అదుపులోకి తీసుకొని విచారించగా ‘లవీ డవీ’ బార్‌ నుంచి వాటిని తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందానికి సమాచారం అందించడంతో ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ నాగమల్లీశ్వర్‌రెడ్డి, సెబ్‌ సూపరిండెంట్‌ బాబు శ్రీధర్‌ తమ సిబ్బందితో గురువారం వేకువజామున ఆ బార్‌పై దాడులు చేశారు. దాదాపు ఐదు గంటలపాటు సోదాలు నిర్వహించి, రూ1.3 కోట్లు విలువ చేసే 78 వేల పైచిలుకు మద్యం సీసాలు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 04:26 AM

Advertising
Advertising