1,139.85 టీఎంసీల వరద
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:42 AM
శ్రీశైలం ప్రాజెక్టుకు 2024-25 నీటి సంవత్సరంలో సోమవారం వరకు 1,139.85 టీఎంసీల వరద చేరినట్లు అంచనా వేశారు. ఇది గత మూడు నెలల్లో వచ్చిన ప్రవాహమని.. ఇది రికార్డు అని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు.
ఈ 3 నెలల్లో శ్రీశైలానికి రికార్డు ప్రవాహం
స్పిల్‌వే, విద్యుదుత్పత్తితో 858.72 టీఎంసీలు విడుదల
సాగునీటి ప్రాజెక్టులకు 107.85 టీఎంసీలు
కొనసాగుతున్న వరద.. ఐదు గేట్లెత్తి దిగువకు విడుదల
సాగర్ నుంచి 1,37,871 క్యూసెక్కుల ప్రవాహం
అదంతా ప్రకాశం బ్యారేజీకే
కర్నూలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టుకు 2024-25 నీటి సంవత్సరంలో సోమవారం వరకు 1,139.85 టీఎంసీల వరద చేరినట్లు అంచనా వేశారు. ఇది గత మూడు నెలల్లో వచ్చిన ప్రవాహమని.. ఇది రికార్డు అని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. స్పిల్‌వే గేట్లు ఎత్తి 604.53 టీఎంసీలు, రైట్ పవర్ కెనాల్ ద్వారా ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 101.45 టీఎంసీలు, తెలంగాణ ప్రభుత్వం లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా 152.74 టీఎంసీలు కలిపి 858.72 టీఎంసీలు దిగువన నాగార్జున సాగర్‌కు విడుదలచేశారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 2,28,307 క్యూసెక్కులు వస్తుండగా.. ఐదుక్రస్టు గేట్లు ఎత్తి దిగువకు 2,28,203 క్యూసెక్కులు వదులుతున్నారు.
Updated Date - Sep 10 , 2024 | 03:43 AM