ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hanumakonda: పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్

ABN, First Publish Date - 2023-10-29T09:34:35+05:30

హనుమకొండ: కాంగ్రెస్‌లోకి వలసల పర్వం మొదలైంది. పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆత్మకూరు మండలం ఎంపీపీ మార్క సుమలత రజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, నీరుకుల్ల ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీ తదితరులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు.

హనుమకొండ: కాంగ్రెస్‌లోకి వలసల పర్వం మొదలైంది. పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆత్మకూరు మండలం ఎంపీపీ మార్క సుమలత రజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, నీరుకుల్ల ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీ తదితరులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు. వారు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది.

కాగా తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ఆదివారం మెదక్ పార్లమెంట్ పరిధిలో జరగనుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలోని గంజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. నర్సాపూర్‌లో 4 గంటలకు కార్నర్‌లో జరగనున్న మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మెదక్‌లో జరిగే సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతారు.

తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొననున్నారు. ఈరోజు బస్సు యాత్రలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొననున్నారు. 30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ.. వచ్చే నెల 1న బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్ర సాగేలా తెలంగాణ పీసీసీ ప్లాన్ చేసింది. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో విడత బస్సు యాత్ర సాగనుంది.

Updated Date - 2023-10-29T09:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising