ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sarpanch Navya: స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్‌పై సర్పంచ్ నవ్య ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-04T18:57:56+05:30

స్టేషన్ ఘన్‌పూర్‌(station Ghanpur )లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ కోసం సర్పంచ్ నవ్య(Sarpanch Navya) ప్రయత్నాలు ముమ్మరం చేసింది.స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్‌పై సర్పంచ్ నవ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వరంగల్: స్టేషన్ ఘన్‌పూర్‌(station Ghanpur )లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ కోసం సర్పంచ్ నవ్య(Sarpanch Navya) ప్రయత్నాలు ముమ్మరం చేసింది.స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్‌పై సర్పంచ్ నవ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోమవారం నాడు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao)ను కలిసి టికెట్‌పై విన్నవించింది. ఎమ్మెల్యే టికెట్ తనకే వచ్చేలా చూడాలని ఎర్రబెల్లిని కోరింది. నవ్య మంత్రి ఎర్రబెల్లిని కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సందర్భంగా నవ్య ABNతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్ నాకే టికెట్ ఇస్తున్నారని భావిస్తున్నా. టికెట్ వచ్చేదాకా నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మాదిగ బిడ్డగా కేసీఆర్ నాకే అవకాశం కల్పిస్తారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కలుస్తాను.నాకే టికెట్ కావాలని కోరతా’’ అని నవ్య తెలిపింది.

Updated Date - 2023-09-04T22:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising