ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: సీపీ రంగనాథ్‌ను వదిలే ప్రసక్తే లేదు: బండి సంజయ్

ABN, First Publish Date - 2023-04-10T18:16:02+05:30

వరంగల్ సీపీ రంగనాథ్‌ (CP Ranganath)ను వదిలే ప్రసక్తే లేదని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. విజయవాడ (Vijayawada) సత్యంబాబు కేసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: వరంగల్ సీపీ రంగనాథ్‌ (CP Ranganath)ను వదిలే ప్రసక్తే లేదని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. విజయవాడ (Vijayawada) సత్యంబాబు కేసులో సీపీ పాత్ర ఏమిటో తమకు తెలుసన్నారు. నల్లగొండ, ఖమ్మంలో ఏం చేశావో తెలుసని గుర్తుచేశారు. ‘‘నువ్వు వేసుకున్న ఖాకీ డ్రెస్ మీద ప్రమాణం చేయాలి. నీ ఆస్తి పాస్తుల చిట్టా బయటకు తీస్తా. నువ్వు ఎక్కడెక్కడ దందాలు చేస్తున్నావో నాకు తెలుసు’’ అని బండి సంజయ్ హెచ్చరించారు. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసు (10th class question papers leakage case)లోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంజయ్‌ ప్రభుత్వాన్ని అసమర్థంగా చూపడానికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేయడానికి ప్రయత్నించారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు.

పదోతరగతి పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌, బీజేపీ కార్యకర్త ప్రశాంత్‌ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిద్దరూ వాట్సాప్‌ (Whatsapp)లో సుదీర్ఘంగా చాటింగ్‌ చేశారని, వాట్సాప్‌ కాల్స్‌ మాట్లాడుకున్నారన్నారని తెలిపారు. ఆ తర్వాతే హిందీ పేపర్‌ లీకేజీకి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఆ మేరకు ఆధారాలు లభించాయన్నారు. పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం కమలాపూర్‌ మండల కేంద్రంలోని స్కూల్‌ నుంచి బయటకు వచ్చిందని వివరించారు. రిమాండ్‌ రిపోర్టు (Remand Report)లో బండి సంజయ్‌ను ఏ1గా, ప్రశాంత్‌ను ఏ2గా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు.

పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. హనుమకొండ (Hanumakonda)లో హెచ్‌ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్‌ బూరం ప్రశాంత్‌ ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ దానిని వైరల్‌ చేశాడు. హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. అయితే, మంత్రి ఎర్రబెల్లితోపాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే విజయ్‌ భాస్కర్‌ తదితరులతో ప్రశాంత్‌ దిగిన ఫొటోలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బయట పెట్టిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-04-10T18:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising