ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఈటల విషయంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-31T17:51:16+05:30

హుజురాబాద్‌ (Huzurabad) లో ఏదో చేస్తామని బీజేపీ (BJP) కబుర్లు చెప్పిందని మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజురాబాద్‌ (Huzurabad) లో ఏదో చేస్తామని బీజేపీ (BJP) కబుర్లు చెప్పిందని మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఈటల రాజేందర్ (Etela Rajendar) ‌ను హుజురాబాద్‌కు పరిచయం చేసింది కేసీఆర్‌ (CM KCR) అన్నారు. జమ్మికుంట (Jammikunta) బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... తండ్రిలాంటి కేసీఆర్‌ను పట్టుకొని ఈటల విమర్శిస్తున్నారని అన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎవరి పాలన దేశానికి అరిష్టమో ఈటలకు తెలియదా?, ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు.. వేశారా?, ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా వచ్చిందా? బండి సంజయ్‌ మోదీని దేవుడు అన్నారు... మోదీ (Modi) ఎవరికి దేవుడు?, రూ.400 ఉన్న గ్యాస్‌ ధర.. వెయ్యికి పెంచినందకు మోదీ దేవుడా?, నిత్యావసర ధరలు పెంచినందుకు మోదీ దేవుడా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హుజూరాబాద్‌ గడ్డమీద గులాబీ జెండా (Trs) ఎగరాలన్నారు.

Updated Date - 2023-01-31T19:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising