ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన

ABN, First Publish Date - 2023-02-06T15:34:34+05:30

తెలంగాణ (Telangana)లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులున్నారని కేంద్రం పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ (Telangana)లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులున్నారని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు ఏపీ, మధ్యప్రదేశ్‌తో కలిపి 2 గిరిజన వర్సిటీలు ఉన్నాయని లోక్ సభలో కేంద్రం వెల్లడించింది. ఈ 2 వర్సిటీల్లో 523 మంది విద్యార్థులే ఉన్నారని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. విభజన చట్టంలో గిరిజన వర్సిటీల ఏర్పాటు ప్రతిపాదన ఉందని కేంద్రం తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని తెలిపింది. గిరిజన వర్సిటీలు అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వీటికి నిర్ణీత ప్రమాణాలంటూ ఏమీ లేవని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సహా సభ్యుల ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Updated Date - 2023-02-06T15:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising