ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Politics: తెలంగాణ ఐఏఎస్‌లలో అలజడి.. కారణమేంటి?

ABN, Publish Date - Dec 29 , 2023 | 09:35 PM

Telangana Politics: తెలంగాణలో ప్రభుత్వం మారింది.. ఒక్క సారిగా అధికారుల్లో కలవరం మొదలైంది. తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక హోదాల్లో పని చేసిన పలువురు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఒక్కరొక్కరుగా సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పలువురు సీనియర్ ఐఏఎస్ లు, కలెక్టర్లపై యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్లల్లో వరుసగా అవినీతి కథనాలు ప్రసారమవుతున్నాయి.

తెలంగాణలో ప్రభుత్వం మారింది.. ఒక్క సారిగా అధికారుల్లో కలవరం మొదలైంది. తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక హోదాల్లో పని చేసిన పలువురు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఒక్కరొక్కరుగా సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పలువురు సీనియర్ ఐఏఎస్ లు, కలెక్టర్లపై యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్లల్లో వరుసగా అవినీతి కథనాలు ప్రసారమవుతున్నాయి. ఫలానా అధికారి అవినీతికి పాల్పడ్డాడని, గత ప్రభుత్వంలో పెద్దలకు తొత్తులుగా మారాడని, కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారని, అవినీతి సొమ్ముతో ఆస్తులు కూడబెట్టుకున్నారని సోషల్ మీడియాలో కథనాలు వండి వారుస్తున్నారు. అయితే తొమ్మిదిన్నరేళ్లుగా ఇలాంటి అనుభావాలను చూడని ఆ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఒక్కసారిగా ఈ వార్తలను, ప్రచారాలను చూసి షాక్‌కు గురవుతున్నారు.

గతంలో రాజకీయ విమర్శల్లో బాగంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, బిజేపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారుల తీరు బాలేదని పద్దతి మార్చుకోవాలని లేదంటే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇవ్వన్నీ రాజకీయ విమర్శల కోణంలోని చూసి లైట్ తీసుకున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వార్తలపై ఆందోళణ చెందుతున్నారు. ఇమేజ్‌ను డామేజ్ చేస్తూ.. తోటి అధికారుల దగ్గర, కుటంబ సభ్యుల దగ్గర వివరణ ఇచ్చుకోలేక తీవ్రంగా మధన పడుతున్నారు. తెలంగాణలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ క్రమంగా పెరుగుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో, వెబ్ సైట్లల్లో, యూట్యూబ్ ఛానళ్లలో వచ్చే వార్తలు క్షణంలో వైరల్ అవుతున్నాయి. వీటినే పార్టీలు తమ ప్రధానా ప్రాచార సాధనాలుగా మాలచుకున్నాయి. ప్రభుత్వం మారడంలో కూడా సోషల్ మీడియా తనవంతు పాత్రను పోషించింది.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పాలనలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ప్రజా పాలనకోసం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. పలువురు సీనియర్ ఐఏఎస్‌లను, పోలీస్ ముఖ్య అధికారులను మార్చారు. బదలీల్లో తన మార్క్ చూపారు. గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన సీనియర్లకు స్థాన చలనం కలిగించారు. పాలనను గాడిలో పెట్టేందుకు సమర్థులైన అధికారులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొందరిని కీలక శాఖాధిపతులుగానే కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్‌లు సోషల్ మీడియా టార్గెట్‌గా మారుతున్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ రావు, సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, వాకాటి కరుణ సహా పలువురు అధికారులు టార్గెట్ గా మారారు. హైదరాబాద్ శివారు జిల్లా కలెక్టర్లు, మాజీ కలెక్టర్ల మీద సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. దీని వెనుక కుట్ర కోణం ఉందా లేక తోటి అధికారులో తమ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలా డిఫేం చేస్తున్నారా అని పలువురు ఐఏఎస్‌లు అయోమయంలో పడ్డారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేక, ప్రతీ ఒక్కరికి వివరణ ఇచ్చుకోలేక సతమతమవుతున్నారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు.. తమను టార్గెట్ చేయడం సరికాదని వాపోతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో కొందరు అధికారులు నిర్లక్ష్యానికి గురైయ్యారు. కేసిఆర్, కేటిఆర్, అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆశీస్సులు ఉన్నవాళ్లకే మంచి పోస్టింగ్ లు దక్కాయి. ఏళ్ల తరబడి కీలక శాఖల్లో మఖ్య అధికారులుగా కొనసాగారు. సీఎంవోలో దళితు ఆఫీసర్లకు చోటులేదన్న విమర్శల దెబ్బకు సీనియర్ ఐఏఎస్ రాహుల్ బొజ్జాను సీఎం సెక్రటరీగా నియమించుకున్నారు. రేవంత్‌రెడ్డిని సీఎం అయ్యాక కొందరు రిటైర్డ్ అధికారులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. కేసిఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల పై వేటు తప్పదన్న ప్రచారానికి రేవంత్ ఫుల్ స్టాప్ పెట్టారు. తమది ప్రజా పాలన అని.. ప్రజల మనసెరిగి పని చేసే అధికారుల సేవలను వాడుకుంటామని స్పష్టం చేశారు. పొస్టింగ్ లలో తన మార్క్ చూపించారు.

అయితే సోషల్ మీడియాలో ఉద్దేశ్య పూర్వకంగానే డామేజ్ ప్రచారం జరుగుతోందని పలువురు ఐఏఎస్ వాపోతున్నారు. పని గట్టుకుని కొందరిని టార్గెట్ చేయడం వెనుక కుట్ర కోణం ఉండవచ్చంటున్నారు. కొందరు సీనియర్ ఐఏఎస్‌లలో ఆధిపత్య పోరు కూడా ఇందుకు కారణం కావొచ్చని చెబుతున్నారు. చీఫ్ సెక్రటరీలుగా అర్హతలున్న అధికారులు ముఖ్యంగా టార్గెట్ కావడం వెనుక కొన్ని అదృశ్య శక్తుల హస్తం కూడా ఉండవొచ్చంటున్నారు. ప్రభుత్వాల పాలసీల అమలుకోసం పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని రాజకీయాలకోసం అధికారులను బలి చెయ్యదని కోరుతున్నారు. అధికారులపై వేధింపులకు అడ్డుకట్ట వేయకపోతే పనిచేయడం కష్టమవుతుందని అబిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన పని చేయకపోతే వాళ్ల ఆగ్రహానికి గురవ్వక తప్పదని మరోవైపు గుడ్డిగా పనిచేస్తూ పోతే గతంలో సీనియర్ ఐఏఎస్ శ్రీదేవి ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిందని ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా ప్రచారాలపై.. వ్యక్తిత్వ హననాల వార్తలపై నియంత్రణ ఉండాల్సిందేనని కోరుతున్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2023 | 09:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising