Tummala: సార్.. మీరు పాలేరు నుంచే పోటీ చేయాలి..
ABN, First Publish Date - 2023-08-30T11:51:12+05:30
వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao)
ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/దమ్మపేట/సత్తుపల్లి: వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) పోటీ చేయాల్సిందేనని పాలేరు నియోజకవర్గంలోని ఆయన అభిమానులు కోరారు. నియోజకవర్గానికి చెందిన పలువురు అభిమానులు మంగళవారం 50కి పైగా వాహనాల్లో ర్యాలీగా దమ్మపేట మండలంలోని గండుగులపల్లి(Gandugulapally)లోని తుమ్మలనివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టిన తుమ్మలను బీఆర్‌ఎస్ అమమానించిందన్నారు. తప్పనిసరిగా పాలేరు(Paleru)లో పోటీ చేయాల్సిందేనని, ఆయన వెంటే తామంతా నడుస్తామని, తుమ్మల తీసుకునే నిర్ణయానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా తుమ్మల వారితో మాట్లాడుతూ తన అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందని తుమ్మల తెలిపారు. తుమ్మలను కలిసినవారిలో సాధు రమేష్‌రెడ్డి, బండి జగదీష్, తమ్మినేని నవీన్, జొన్నలగడ్డ రవి, శాఖమూరి రమేష్, మల్లారెడ్డి, కొల్లూరి రమేష్ తదితరులతో పాటు 300మందికిపైగా అభిమానులున్నారు.
Updated Date - 2023-08-30T11:51:14+05:30 IST