ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేసీఆర్‌కు పొంగులేటి షాక్..! ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌ను మార్చిన పొంగులేటి

ABN, First Publish Date - 2023-01-16T17:54:21+05:30

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ‘కారు’ దిగిపోనున్నారా? బీఆర్‌ఎస్‌ (BRS) కు గుడ్‌బై చెప్పనున్నారా? సంక్రాంతి తర్వాత పార్టీ మారనున్నారా...

ఖమ్మం: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ‘కారు’ దిగిపోనున్నారా? బీఆర్‌ఎస్‌ (BRS) కు గుడ్‌బై చెప్పనున్నారా? సంక్రాంతి తర్వాత పార్టీ మారనున్నారా? కాషాయ కండువా కప్పుకోనున్నారా? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. ఈ ప్రచారానికి ఆయన బలం చేకూర్చుతూ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పొంగులేటి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాక సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్, కేసీఆర్ ఆర్మీ ఫొటోలను ప్రొఫైల్ పిక్‌‌గా ఉంచిన పొంగులేటి... ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఈ చర్యలతో పార్టీ మార్పు ప్రచారానికి పొంగులేటి బలాన్ని ఇస్తున్నారు. ఎల్లుండి ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)ను పొంగులేటి కలిసే అవకాశం ఉంది. ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావం సభ సమయంలోనే పొంగులేటి బీజేపీ (BJP)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం బీజేపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో బలమైన నాయకత్వం లేదు. ఈ క్రమంలో పొంగులేటి వస్తే పార్టీ బలోపేతం కావడంతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. కొంతకాలం క్రితం పొంగులేటి తన కుమార్తె వివాహన్ని ఇండోనేషియాలోని బాలిలో జరిపించారు. ఈ వేడుకకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు వెళ్లడంతో పాటు అక్కడ భవిష్యత్‌ రాజకీయ చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ మంతనాలు ఇప్పుడు ఫలిస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. బాలిలో బీజేపీ ముఖ్య నేతలతో పొంగులేటి భేటీ అయ్యారని చెబుతున్నారు. జనవరి 1న కార్యకర్తలు, అభిమానులతో భారీ బల ప్రదర్శన చేసిన పొంగులేటి.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. పైగా, ఆ సమ్మేళనంలో ‘‘తేలుస్తారా.. తేల్చుకోమంటారా?’’ అంటూ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రతిగా బీఆర్‌ఎస్‌ సర్కారు పొంగులేటి భద్రతను తగ్గించింది. పొంగులేటి బీజేపీలోకి వెళ్లనున్నారనే ప్రచారం ఊపందుకోగా.. ఆయన్ను ఆహ్వానించేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-01-16T17:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising