ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress Party: తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకం

ABN, Publish Date - Dec 18 , 2023 | 07:32 PM

Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. వచ్చే ఏడాది మార్చిలో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జులుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. వచ్చే ఏడాది మార్చిలో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జులుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా సీతక్క, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జిగా శ్రీధర్‌బాబు, కరీంనగర్ పార్లమెంట్ ఇంఛార్జిగా పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా జీవన్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా పి.సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించింది.

మెదక్ పార్లమెంట్ ఇంఛార్జిగా దామోదర్ రాజనర్సింహ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల ఇంఛార్జిగా భట్టి విక్రమార్క, చేవెళ్ల, మహబూబ్‌నగర్ స్థానాల పార్లమెంట్ ఇంఛార్జిగా సీఎం రేవంత్‌రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంఛార్జిగా జూపల్లి కృష్ణారావు, నల్గొండ పార్లమెంట్ ఇంఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జిగా కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం స్థానాల పార్లమెంట్ ఇంఛార్జిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. జనవరిలో పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపింది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 07:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising