ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-01-09T14:25:09+05:30

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ 40 మంది అన్నదాతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ

విచారణ వాయిదా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ 40 మంది అన్నదాతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన రీక్రియేషన్ మ్యాప్‌ను న్యాయవాది సృజన్‌రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. దీంతో బుధవారం వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. అడ్వకేట్ జనరల్ వినతి మేరకు తదుపరి విచారణ ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.

మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ రద్దుకు తీర్మానం చేయాలని 49 మంది కౌన్సిలర్లకు రైతు జేఏసీ వినతిపత్రం ఇచ్చారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్ తండ్రికి కూడా అందజేశారు.

ఇదిలా ఉంటే కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌తో భూమి పోతుందేమోనన్న భయాందోళనతో ఇటీవల రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని నిరసిస్తూ గత వారం విపక్షాలు, రైతులు పెద్ద ఎత్తున కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.

Updated Date - 2023-01-09T14:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising