ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha: ఆర్మూర్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది

ABN, First Publish Date - 2023-01-30T12:16:48+05:30

ఆర్మూర్‌కు ప్రత్యేక చరిత్ర ఉందని.. నవనాధులనే సాధువుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతమిది అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ఆర్మూర్‌కు ప్రత్యేక చరిత్ర ఉందని.. నవనాధులనే సాధువుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతమిది అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. సోమవారం నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. కేదారేశ్వర ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సదస్సు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపాడుకున్నాం కాబట్టే దేశం గొప్ప స్థాయిలో ఉందని చెప్పారు. తెలంగాణలో ధర్మ రక్షణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. దేశంలో అందరూ సోదర భావంతో మెలుగుతూ దేశం విశ్వ గురువుగా ఎదుగాలని కోరుకున్నారు. భారత జాతిని ముందుకు నడపాలని సాధుసంతులను వేడుకుంటున్నానని ఎమ్మెల్యే కవిత తెలిపారు.

Updated Date - 2023-01-30T12:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising