ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha ED enquiry: కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

ABN, First Publish Date - 2023-03-21T17:39:48+05:30

తన చెల్లి, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికరమైన ట్వీట్ చేశారు... ఏమని చేశారంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: తన చెల్లి, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ఒకరు ఈ గిఫ్ట్ ఇచ్చారు’ అనే ట్యాగ్‌‌తో ‘ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు.. నిరంకుశత్వం దిశగా భారత్’ అనే పుస్తకం కవర్ పేజీ ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ పుస్తకాన్ని దెబాశిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు. కాగా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఇదివరకే కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యమని బీజేపీ సర్కార్ లక్ష్యమని వారం రోజుల క్రితమే మీడియా సమావేశంలో కేటీఆర్ అన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీని ఎందుకు ప్రశ్నించరని విమర్శించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.

6 గంటలుగా విచారణ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. ఉదయం 11:30 గంటలకు ఆమె ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అంటే దాదాపు 6 గంటలుగా విచారణ కొనసాగుతోంది. కాగా ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారణకు హాజరైన కవితను ఈడీ అధికారులు విచారించి ఇంటికి పంపారు. మరి విచారణలో మూడో రోజయిన మంగళవారం ఈడీ ఏం చేయబోతోందనేది ఉత్కంఠగా మారింది. విచారణ అనంతరం ఇంటికి పంపిస్తారా? లేక అనూహ్యంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విచారణ ఎన్నిగంటల వరకు కొనసాగుతుందో కూడా స్పష్టత లేదు.

Updated Date - 2023-03-21T18:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising