ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CP Swetha: ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడు రాజుకి 14రోజుల రిమాండ్

ABN, First Publish Date - 2023-11-01T19:04:10+05:30

ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి( MP Prabhakar Reddy )పై ఈ నెల 30వ తేదీ రోజున సూరంపల్లిలో కత్తితో నిందితుడు రాజు దాడి చేశాడని సీపీ శ్వేత ( CP Swetha ) తెలిపారు.

సిద్దిపేట: ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy )పై ఈ నెల 30వ తేదీ రోజున సూరంపల్లిలో కత్తితో నిందితుడు రాజు దాడి చేశాడని సీపీ శ్వేత ( CP Swetha ) తెలిపారు. బుధవారం నాడు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్వేత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ...‘‘ప్రజల ఆగ్రహంతో ఎంపీపై కత్తితో దాడి చేసిన వ్యక్తి రాజుపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి అన్నీ ఆధారాలు సేకరించాము. దాడి చేసిన వ్యక్తి పలు న్యూస్ ఛానళ్లలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం కత్తినీ కొని ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై నేరం చేయడానికి సిద్ధం అయ్యారు. నిందితుడిని నేడు కోర్టు ముందు హాజరు పరచగా జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. నిందితుడికి ఎవరైనా సహకారం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నాము. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టవద్దు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి నిందితుడు రాజు ఎవరి సహకారం తీసుకోలేదు, అతనొక్కడే ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశారు. నిందితుడు సెన్సేషనల్ క్రియేట్ చేయడానికే దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది’’ అని సీపీ శ్వేత తెలిపారు.

Updated Date - 2023-11-01T19:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising