ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Komatireddy: మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులు: మంత్రి కోమటి రెడ్డి

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:04 PM

ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణలో పాలనను గాడిలో పెడుతున్నామని, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు.

ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణలో పాలనను గాడిలో పెడుతున్నామని, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్ ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని, కనీసం కాలువలు తవ్వలేదని విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులని అన్నారు. మేడిగడ్డ కుంగటం విధ్వంస చర్య అని కల్లబొల్లి మాటలు చెప్పారన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయితో కూడిన పాలన ప్రజలకు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 01:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising