JP Nadda: బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ : జేపీ నడ్డా
ABN, First Publish Date - 2023-11-19T14:36:45+05:30
బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. "ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్(CM KCR) కుటుంబానికే లబ్ధి జరిగింది. ఈనెల 30న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించేవి. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అధికంగా నిధులు కేటాయించారు. కుటుంబ పాలనను అంతమొందించాలి.
ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారింది. ఆయన అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. మియాపూర్ భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగింది. దళితబంధులో BRS ఎమ్మెల్యేలకు 3 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోంది. 3 శాతం కమీషన్ తీసుకునే ప్రభుత్వాన్ని సాగనంపాలి" అని కోరారు.
Updated Date - 2023-11-19T14:36:46+05:30 IST