ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్ తీరుపై యాదవ సంఘాల ఫైర్.. గాంధీభవన్‌ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-05-25T15:16:15+05:30

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. నిరసనగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా

Revanth Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. నిరసనగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా గురువారం ఇందిరాపార్కు దగ్గర ఆందోళన చేపట్టాయి. అనంతరం యాదవ జేఏసీ ర్యాలీగా గాంధీభవన్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో గొల్లకురుమలను ఇందిరాపార్కు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో యాదవ సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే యాదవ సంఘాల గాంధీభవన్ Gandhi bhavan) ముట్టడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీభవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బారిగేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అటు వైపుగా రాకుండా కట్టడి చేస్తున్నారు.

Updated Date - 2023-05-25T15:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising