TSPSC: శంకర్ లక్ష్మీపై దృష్టి పెట్టిన సిట్.. రేణుకకు ఆ పేపరు ఎలా చేరిందంటే...!
ABN, First Publish Date - 2023-03-17T15:47:08+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సిట్ అధికారులు తవ్వేకొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సిట్ అధికారులు తవ్వేకొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మీపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. శంకర్ లక్ష్మీ పాస్ వర్డ్‌ను నిందితుడు ప్రవీణ్ దొంగిలించినట్లుగా గుర్తించారు. పాస్ వర్డ్‌ను శంకర్ లక్ష్మీ డైరీలో రాసుకుంది. ఆ పాస్ వర్డ్‌ను తెలివిగా ప్రవీణ్ తస్కరించాడు. శంకర్ లక్ష్మీని విచారిస్తే మరి కొన్ని అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్.. పేపర్‌ను ప్రింట్ తీసుకుని రేణుకకు ఇచ్చినట్లుగా గుర్తించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష (AE Exam) తో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్ష పేపర్లను కూడా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను 2022, సెప్టెంబర్ 16న నిర్వహించారు. రద్దు చేసిన ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సిట్ నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. 2023, జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. త్వరలో జరగబోయే మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-03-17T15:47:08+05:30 IST