ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tarakaratna: ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న పెద్దకర్మ

ABN, First Publish Date - 2023-03-02T13:30:13+05:30

మహాశివరాత్రి రోజున కన్నుమూసిన నందమూరి తారకరత్న పెద్ద కర్మను ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో కుటుంబసభ్యులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: మహాశివరాత్రి రోజున కన్నుమూసిన నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) పెద్ద కర్మను ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌ (Filmnagar Cultural Club)లో కుటుంబసభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), బాలకృష్ణ - వసుంధర దంపతులు (Balakrishna - Vasundhara couple), నందమూరి కుటుంబ సభ్యులు (Nandamuri Family) హాజరై తారకరత్న చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే టీడీపీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి (Ravula Chandrasekhara Reddy), అయ్యన్న పాత్రుడు ( అయ్యన్న పాత్రుడు), మాగంటి బాబు (Magantibabu), కంభంపాటి (Khambhampati) తదితరులు తారకరత్న దశదిన కర్మలో పాల్గొన్నారు.

ఫోటోల కోసం ఈ కింది లింక్‌‌ను క్లిక్‌ చేయండి...

కాగా టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర (TDP Leader Lokesh Yuvagalam Padayatra)లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యిన విషయం తెలిసిందే. ఇరవై రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. మహాశివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 18న తారకరత్న మృతి చెందగా.. ఫిబ్రవరి 20న అంత్యక్రియలు జరిగాయి. రెండు రోజుల తర్వాత ఫిల్మ్‌నగర్ కల్చరల్ ‌క్లబ్‌లో చినకర్మ జరిగింది. ఆ రోజు తారకరత్న భార్య అలేఖ్య(Tarakaratna Wife Alekhya) కుమిలిపోయిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. తారకరత్న భార్య అలేఖ్య దుఃఖం, బాధ ఎవరూ తీర్చలేనిది. తారకరత్న ఫోటో చూసి అలేఖ్య ఆగకుండా విలపించిన తీరు చూసినవాళ్ళను కూడా కన్నీళ్లు పెట్టించింది. నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి తారకరత్నకు నివాళులు అర్పించి చిన్న కర్మలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్నీ చేయించి, అందరినీ తనే రిసీవ్ చేసుకొని, మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయించి, దగ్గరుండి తనే చూసుకున్నారని తెలిసింది.

Updated Date - 2023-03-02T14:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!