ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Leakage: గ్రూప్ 1 పేపర్ లీక్‌‌పై సిట్ దర్యాప్తు అధికారి ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2023-03-17T13:34:55+05:30

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్(TSPSC Leakage) కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు (SIT investigating officer Venkateshwarlu) మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ నుంచి ఐదు పేపర్లు లీక్ అయ్యాయని తెలిపారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందా లేదా అనే విషయం దర్యాప్తు తర్వాత చెప్తామన్నారు. ఇన్వెస్టిగేషన్ సీరియస్‌గా చేస్తున్నామని అన్నారు. కంప్యూటర్ లాన్‌లోకి వెళ్లి పేపర్లను తమ పెన్ డ్రైవ్‌లోకి తీసుకున్నారని... రాజకీయ నాయకుల ఫోటోలు దొరికాయని.. వారి పాత్ర ఉందా లేదా అనేది విచారణ చేయాలని చెప్పారు.

ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ రెడ్డి పాత్ర కీలకమన్నారు. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కలిసి లక్ష్మీని ట్రాప్ చేశారని.. లక్ష్మీ దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగలించి మొత్తం ఐదు పేపర్లను కాపీ చేసుకున్నట్లు సమాచారం ఉందన్నారు. ఏయే పేపర్లు లీక్‌ అయ్యాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏఈ పరీక్ష పేపర్‌ను రేణుకకు ప్రవీణ్‌ అమ్మాడన్నారు. ప్రవీణ్‌ రాసిన పరీక్షలో అధిక మార్కులు రావడంపై దర్యాపు చేస్తున్నామని అన్నారు. ప్రవీణ్‌ ఎవరెవరికి పేపర్‌ ఇచ్చారన్నదానిపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్లు వెల్లడించారు.

కాగా.. టీఎస్‌పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఏ3 రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించగా.. మిగిలిన 8 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Updated Date - 2023-03-17T13:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising