Shabbir Ali: పీఏసీలో చర్చించిన అంశాలేంటో వెల్లడించిన షబ్బీర్ అలీ
ABN, Publish Date - Dec 18 , 2023 | 04:06 PM
Telangana: మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని.. మూడు తీర్మానాలు చేశామని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపామన్నారు.
హైదరాబాద్: మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని.. మూడు తీర్మానాలు చేశామని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ (PAC convener Shabbir Ali) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపామన్నారు. ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనాయకులందరికి ధన్యవాదాలు తెలిపామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలిపారు. అలాగే 6 హామీల అమలుపై చర్చ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై భట్టి విక్రమార్క వివరించారని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ అవకతవకలపై చర్చ జరిపామన్నారు. రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ గృహాలు, గ్యాస్ ధర రూ.500పై చర్చించినట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు పెట్టి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం పార్లమెంటుల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు.
పీఏసీ సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 హామీలు అందజేస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Dec 18 , 2023 | 04:06 PM