ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naveen Murder Case: నిహారికకు బెయిల్..చర్లపల్లి జైలు నుంచి విడుదల

ABN, First Publish Date - 2023-03-19T12:57:40+05:30

తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు (Naveen Murder Case) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రంగారెడ్డి: తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు (Naveen Murder Case) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని (Friend Murder) అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. నిందితుడు హరిహరకృష్ణ, అతని స్నేహితుడు హసన్‌, నిహారికను(Niharika) పోలీసులు విచారించారు. అయితే..నవీన్‌ హత్యకేసులో నిందితురాలైన నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారికకు రంగారెడ్డి కోర్టులో(Rangareddy Court) ఆదివారం ఊరట లభించింది. రంగారెడ్డి కోర్టు నిహారికకు బెయిల్‌ మంజూరు(Grant bail) చేసింది. దీంతో చర్లపల్లి జైలు(Charlapally Jail) నుంచి నిహారిక విడుదలైంది.

కాగా, నల్గొండ ఎంజీ యూనివర్శిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌‌కు.. అదే కళాశాలలో చదువుతున్న హరిహరకృష్ణతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే వీరిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. విషయం తెలుసుకుని ఇరువురు కొద్దిరోజులుగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో తను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని తప్పించాలని హరిహరకృష్ణ ప్లాన్ చేశాడు. దాని ప్రకారం ఫిబ్రవరి 17న ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. నవీన్‌ తీవ్రంగా గాయపరిచిన హరిహరకృష్ణ... అతడి గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అత్యంత కిరాతంగా నవీన్‌ తల, మొండెం వేరు చేశాడు. గుండెను బయటకు తీసి, మర్మాంగాలు కోసేశాడు. పేగుల బయటకు తీసి సైకోలా ప్రవర్తించాడు. ఆపై అక్కడి నుంచి తండ్రి వద్దకు వెళ్లిన హరిహరకృష్ణ హత్య గురించి చెప్పాడు. ప్రియురాలికి కూడా చెప్పడంతో పోలీసుల ఎదుట లొంగిపొమ్మని సూచించింది. చివరకు తండ్రి సూచన మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల వద్ద హరిహరకృష్ణ లొంగిపోయాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Updated Date - 2023-03-19T13:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising