ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: కవిత వర్సెస్ బండి సంజయ్

ABN, First Publish Date - 2023-09-26T16:43:53+05:30

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కవిత మాట్లాడుతూ.. దేశంలో భారతీయ జనతాపార్టీ రాజ్యాంగం నడుస్తోందన్న అనుమానం కలుగుతోందని అన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కవిత (Kavitha), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (BJP National General Secretary) బండి సంజయ్‌ (Bandi Sanjay)ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కవిత మాట్లాడుతూ.. దేశంలో భారతీయ జనతాపార్టీ రాజ్యాంగం నడుస్తోందన్న అనుమానం కలుగుతోందని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు (Governors) ఈ విధంగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. రాజ్యాంగ బద్ద సంస్థ.. వాటికి ఉండే హక్కులు, పరిధులు ఉంటాయని, వాటిని గమనించుకుని ప్రజలను ఒక తాటిపై నడిపించాల్సిందిపోయి.. గవర్నర్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని కవిత అన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీలుగా ఇచ్చిన రెండు పేర్లు బడుగు, బలహీన వర్గాలకు సంబంధిచిన అభ్యర్థులని, వారిని గవర్నర్ తమిళి సై (Governor Tamili sai) తిరస్కరించడం సరికాదన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ బీసీ వ్యతిరేకపార్టీ అన్న విషయం మరోసారి రుజువైందని కవిత అన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏ ఫైలు పంపించినా కళ్లు మూసుకుని రబ్బరు స్టాంప్‌లా సంతకం పెడితే గవర్నర్ వాళ్లకు మంచిగా కనిపిస్తారని, తన వద్దకు వచ్చిన ఫైలుకు సంబంధించి గవర్నర్ అన్ని విషయాలు పరిశీలించి న్యాయబద్దంగా వ్యవహిరిస్తే ఒక పార్టీకి ముద్ర వేస్తారని విమర్శించారు. వాళ్లకు అనుకూలంగా మాట్లాడితే మంచివాళ్లు లేక పోతే తెలంగాణకు, అభివృద్ధికి వ్యతిరేకమని విమర్శలు చేస్తారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. వచ్చిన ఫైలుపై గవర్నర్ అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-26T16:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising