ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Srinivas Goud : శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...

ABN, First Publish Date - 2023-07-31T13:45:55+05:30

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 19-11-2018 దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ కొనసాగింది. అఫిడవిట్‌లు, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దని వాది, ప్రతివాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 19-11-2018 దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ కొనసాగింది. అఫిడవిట్‌లు, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దని వాది, ప్రతివాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

కాగా.. గత వారం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారంటూ మహబూబ్‌నగర్‌ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌కు అర్హత లేదని పిటిషన్‌ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్‌ వేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఇరువాదనలు పూర్తి అవగా.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది.

Updated Date - 2023-07-31T13:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising