ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం తీరును ఎండగట్టిన Harish Rao

ABN, First Publish Date - 2023-02-06T12:21:36+05:30

తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేంద్రం తీరును మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ (Telangana Budget)ను ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేంద్రం తీరును మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ఎండగట్టారు. తెలంగాణ (Telangana) అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర రుణ పరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించిందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు విధించిందన్నారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని హరీష్ పేర్కొన్నారు.

నీతి ఆయోగ్‌ సిఫారసులను కేంద్రం పట్టించుకోవట్లేదని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. విభజన సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. ట్రైబ్యునల్‌ తీర్పుల పేరిట జాప్యం చేస్తోందన్నారు. ఏపీ నుంచి విద్యుత్‌ బకాయిలు ఇప్పించమంటే పట్టించుకోవట్లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రం గణనీయంగా ప్రగతి సాధిస్తోందన్నారు. విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T12:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising