ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం

ABN, First Publish Date - 2023-12-05T08:06:47+05:30

న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంగళవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు.

న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంగళవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. ఈ ఇద్దరు నేతలు ప్రత్యేక విమానంలో సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

మంగళవారం ఉదయం పార్లమెంటులో జరగనున్న ఇండియా కూటమి భేటీ తర్వాత తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనుంది. సీఎల్పీ భేటీలో చోటు చేసుకున్న పరిణామాలను ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఇతర అగ్ర నేతలకు డీకే వివరించారు. ఎవరిని ఏ పదవిలో నియమించాలో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. అధిష్టానం ఆమోద ముద్ర తర్వాత... ఏఐసీసీ పరిశీలకుడిగా డీకే శివకుమార్ ఆ వివరాలు బయటికి వెల్లడించనున్నారు. అయితే ఢిల్లీలో వెల్లడించాలా? లేక హైదరాబాద్‌లో ముందు ఎమ్మెల్యేలకు తర్వాత మీడియాకు వెల్లడించాలా? అన్నది ఏఐసీసీ వర్గాలు ఇవాళ ఖరారు చేయనున్నారు. కాగా ఈ మధ్యాహ్నం డీకే శివకుమార్, మానిక్ రావు ఠాక్రే తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలైంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం సీఎల్పీ (CLP Meeting) సమావేశం జరగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలనే దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ఇప్పటికే సీఎల్పీ తీర్మానం ఢిల్లీకి కూడా చేరింది.

Updated Date - 2023-12-05T08:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising