ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress leaders: ఐటీ విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు... ఎవరిని పంపారంటే?

ABN, First Publish Date - 2023-11-06T12:38:41+05:30

కాంగ్రెస్ నేతలపై ఐటీ అధికారులు సోదాలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల (Congress leaders) ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈరోజు (సోమవారం) ఐటీ విచారణకు కాంగ్రెస్ నేతలు బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి (Badung Pet Mayor Parijata Narsimha Reddy), మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్‌ (Maheswaram Congress Candidate KLR) హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు కాంగ్రెస్ నేతలు హాజరుకాకుండా... తమ చాటెడ్ అకౌంటెంట్స్‌ను పంపించారు. బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, కేఎల్‌ఆర్‌లకు సంబంధించిన చాటెడ్ అకౌంటెంట్స్ కాసేపటి క్రితమే ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. గతంలో సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌పై ఐటీ ఆరా తీస్తోంది. ఎన్నికల సమయంలో బిజీగా ఉండడం వలన హాజరుకాలేనని ఐటీకి కేఎల్ఆర్ తెలిపారు.


ఇటీవల కాంగ్రెస్ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్‌పై ఐటీ సోదాలు జరిపింది. సోదాల అనంతరం బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్‌కు ఐటీ నోటీసులు జారీ చేసింది. కేఎల్‌ఆర్ ఇంట్లో, ఆఫీస్‌లలో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగాయి. పారిజాతం నరసింహ రెడ్డి ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌పై ఐటీ అధికారులు విచారణ చేయనున్నారు. పార్టీ కార్యక్రమాలు, ఇతర వ్యవహారాల ఉన్నాయని ఐటీ విచారణకు రాలేనని కేఎల్‌ఆర్ ముందే చెప్పేశారు.

Updated Date - 2023-11-06T12:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising