ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: దీపాదాస్ మున్షీని స్వాగతిస్తున్నాం..

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:47 AM

హైదరాబాద్: తెలంగాణకి కొత్త ఏఐసీసీ (AICC) ఇంఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంకితభావం, నిబద్ధతలతో తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణకి కొత్త ఏఐసీసీ (AICC) ఇంఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ (Dipadas Munshi)ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ట్వీట్ (Tweet) చేశారు. అంకితభావం, నిబద్ధతలతో తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అలాగే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసినందుకు, పార్టీని గైడ్ చేసినందుకు గత ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే‌కు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ఠాక్రేకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా సార్వత్రక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది. 12 మంది ప్రధాన కార్యదర్శులతో పాటు 11 రాష్ట్రాలకు ఇన్‌చార్జిలను నియమించింది. వివిధ రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జులను మార్చింది. ఇందులో భాగంగా.. ఇప్పుటి దాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్‌రావ్‌ ఠాక్రేను మార్చింది. పార్టీ కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ఠాక్రేను గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించింది. ఇప్పటి దాకా గోవా బాధ్యతలు చూస్తున్న మాణిక్కం ఠాగూర్‌కు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. నిజానికి, తెలంగాణకు అదనపు ఇన్‌చార్జిగా నియమితులైన దీపాదాస్‌ మున్షీ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు.

ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ ముఖ్య పరిశీలకురాలిగా వచ్చిన ఆమె.. అసంతృప్తులను బుజ్జగించడం, అలిగిన నేతలకు తగిన హామీలు ఇవ్వడం వంటివి చేశారు. ఫలితంగా ఆమెకు ఇక్కడి పరిణామాలన్నింటిపైనా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ మార్పుల్లో భాగంగా ఠాక్రేను గోవాకు పంపిన అధిష్ఠానం.. తెలంగాణకు పూర్తిస్థాయి ఇన్‌చార్జిని నియమించే వరకూ అదనపు బాధ్యతలను దీపాదాస్‌ మున్షీకి అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. పార్లమెంటు ఎన్నికలయ్యే వరకూ ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగించనున్నట్లూ చెబుతున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకూ దీపాదాస్‌ మున్షీనే అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Dec 24 , 2023 | 11:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising