ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Watch Video: ‘రేవంత్ అన్నా’.. అంటూ మహిళ పిలవగానే.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-12-11T12:23:41+05:30

Telangana: ‘‘మేం పాలకులం కాదు.. సేవకులం’’ అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అక్షరాల నిజం చేస్తున్నారు. అందుకు ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోనే సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యమంత్రి ప్రజల మనిషి అనే ఈ ఒక్క వీడియోతో చెప్పేయొచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ మహిళ పట్ల ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరుపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: ‘‘మేం పాలకులం కాదు.. సేవకులం’’ అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్షరాలా నిజం చేస్తున్నారు. అందుకు ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోనే సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యమంత్రి ప్రజల మనిషి అని ఈ ఒక్క వీడియోతో చెప్పేయొచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ మహిళ పిలుపుకు ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి’’ అంటూ ఓ మహిళ పిలవగానే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటన సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.


తుంటి ఎముక ఫ్యాక్చర్‌తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (Former CM KCR) పరామర్శించేందుకు ఆదివారం సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌ను పరామర్శించి తిరిగి వెళ్తుండగా రేవంత్ అన్నా అంటూ ఓ మహిళ పిలిచింది. మహిళ పిలిచిన వెంటనే స్పందించిన సీఎం.. ఆమె దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో చెప్పమని అడిగారు. దీంతో తన పాపకు ఆస్పత్రి ఖర్చు చాలా అవుతోందని, సాయం చేయాలని మహిళ కోరింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామాన్యులు పిలవగానే పలికిన సీఎం రేవంత్ వ్యక్తిత్వంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సీఎం అంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2023-12-11T12:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising