ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Etela Challenge: సింగరేణిపై నాతో చర్చకు సిద్ధమా.. బీఆర్‌ఎస్‌కు ఈటల సవాల్

ABN, First Publish Date - 2023-04-21T14:29:16+05:30

సింగరేణి ప్రైవేటీకరణపై తనతో చర్చకు రావాలని బీఆర్ఎస్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సింగరేణి (Singareni) ప్రైవేటీకరణపై తనతో చర్చకు రావాలని బీఆర్ఎస్‌కు (BRS) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) సవాల్ విసిరారు. సింగరేణి లాభాల్లో ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు (Vizag Steel Plant) ఎందుకు బిడ్ చేయలేదో కేసీఆర్ (CM KCR) చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడో ఉన్న వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌ను కాదు.. పేదలకు అండగా ఉండే తెలంగాణ ఆర్టీసీని (Telangana RTC) కాపాడాలని హితవుపలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM) పుణ్యాన నాలుగు వేల ఆర్టీసీ బస్సులు ఖతం అయ్యాయని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ సంగతి సరే.. తెలంగాణ చెరుకు రైతుల‌ కోసం‌ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవటం లేదని ఆయన నిలదీశారు.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రం, బీజేపీపై బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. సింగరేణి మైన్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం మానుకోవాలన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని రామగుండం గడ్డ మీద ప్రధాని (PM Modi) మాటిచ్చారని గుర్తుచేశారు. నైనీ బ్లాక్, తాడిచర్ల మైన్స్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. తెలంగాణలో(Telangana) సమాచార హక్క చట్టం అలంకారప్రాయంగా మారిందని విమర్శించారు. ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పుకొచ్చారు. సింగరేణి బాగుండాలనే కేంద్రంలో ఉన్న బీజేపీ‌ ఆకాంక్ష అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-21T14:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising