ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti: భజరంగ్‌దళ్‌పై వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో కాంగ్రెస్ చెప్పాలి

ABN, First Publish Date - 2023-05-05T15:44:17+05:30

కర్ణాటక ఎన్నికల మానిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల మానిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ (Congress) ప్రస్తావించడం ఎంత వరకూ సమంజసమో ఆ పార్టీ విశ్లేషించుకోవాలన్నారు. హిందువులు విశ్వసించే భావాలకు, నమ్మకాలకు వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ను మెజారిటీ ప్రజలు అనుమానించే పరిస్థితిని ఆ పార్టీయే స్వయంగా సృష్టించుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటనను యూపీఏ భాగస్వాములుగా ఉందామనుకుంటున్న ఎన్ని రాజకీయ పార్టీలు సమర్ధిస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. భజరంగ్‌దళ్‌పై నిషేధం, ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర విమర్శలు... ఇవన్నీ ఎంఐఎం వంటి పార్టీల అనుకూలత కోసమే అనే విషయాన్ని ప్రజల్లో ఆలోచన రేపుతోందన్నారు. నిజానికి ప్రజలలో విభజన సృష్టించడమే బీజేపీ విధానమైతే... ఈ రోజు దేశమంతా ఆత్యధికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల రూపంలో పరిపాలనా బాధ్యతలలో ఉండదని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2023-05-05T15:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising