Home » Vijayashanti
బీజేపీ నేత విజయశాంతి పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని రాములమ్మ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని.. బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని... అది బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల అంతర్గత వ్యవహారమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏదో చెప్పారని.. దాన్ని బట్టి తమ పార్టీలోకి చేరికలు ఉండబోవంటున్న ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు బీజేపీ నాయకురాలు విజయశాంతి సూటి ప్రశ్న వేశారు. నాటి దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! అని ప్రశ్నించారు.
1983 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలైన విషయాన్ని మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి గుర్తు చేశారు. ఆ సమయంలో టీడీపీ ప్రభంజనం నడుస్తోందని.. అలాంటి తరుణంలో కేసీఆర్ ఎందుకు గెలవలేదో చెప్పాలన్నారు. నేడు ఆమె ఫేస్‌బుక్ వేదికగా సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్‌కు ప్రతిపక్షాలను దేశ ప్రజలే ఎంపీలుగా సరైన సంఖ్యలో పంపటం గత రెండు ఎన్నికల నుంచి జరగలేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మరోసారి ఇవ్వడం స్పష్టమని అనిపిస్తోందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును రద్దు చేసిన తదినంతర పరిణామాలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవడంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని చెబుతూ ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే రూ.2000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందన్నారు.
ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల వేడుక సందర్భంగా హైదరాబాద్‌లోని నేటి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. ఆ శతాబ్ది ఉత్సవాలకు తనను ఆహ్వానించిన వారందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రపై ఆ పార్టీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
కర్ణాటక ఎన్నికల మానిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
బీఆర్‌ఎస్ పేరు చెబితే మిగితా రాష్ట్రాల రాజకీయా పార్టీలు భయపడుతున్నాయని... ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.