TS NEWS: శబరిమలకి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పని తిప్పలు
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:52 PM
శబరిమలకి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తిప్పలు తప్పడం లేదు. సాంకేతిక కారణాలతో వారు వెళ్లాల్సిన ఫ్లైట్‌ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది.
హైదరాబాద్: శబరిమలకి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తిప్పలు తప్పడం లేదు. సాంకేతిక కారణాలతో వారు వెళ్లాల్సిన ఫ్లైట్‌ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు శబరి వెళ్లేందుకు ఫ్లైట్‌ని స్వాములు బుక్ చేసుకున్నారు. అయితే సాంకేతిక కారణాల సాకుతో రద్దు సంబంధిత ఫ్లైట్ నిర్వాహకులు విమానం రద్దు చేయడంతో అయ్యప్పలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత ఫ్లైట్ నిర్వాహకులు పొంతనలేని సమాధానం చెప్పడంతోఎయిర్‌పోర్ట్‌లోనే స్వాములు వేచి చూస్తున్నారు. ఎయిర్ ఇండియా అధికారం నిర్లక్ష్యం కారణంగా శబరిమలకు తర్వగా వెళ్లలేక పోతున్నామని స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - Dec 17 , 2023 | 11:53 PM