ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah: ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటిసారి తెలంగాణకి అమిత్ షా

ABN, First Publish Date - 2023-10-09T16:17:19+05:30

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) రానున్నారు.

హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) రానున్నారు. ఈమేరకు బీజేపీ పార్టీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రేపు మధ్యాహ్నం 1.45గంలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 3గంటల‌ నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలో అమిత్ షా ప్రసగింస్తారు. సభ అనంతరం 5.15గంలకు హెలికాప్టర్‌లో బేగంపేట్‌కు చేరుకుంటారు. బేగంపేట్ ఐటీసీ కాకతీయ హోటల్‌కు అమిత్ షా వెళ్తారు. సాయంత్రం 6.20గంలకు సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లో మేధావులతో సమావేశం అవుతారు. మేధావుల సమావేశం తర్వాత కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. రాత్రి 7.30 కు ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్‌కు ఎన్నికల వ్యూహాలపై అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు.

Updated Date - 2023-10-09T16:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising