Fire Accindent: హైదరాబాద్ గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
ABN, First Publish Date - 2023-11-29T18:09:26+05:30
రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు.
మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోటి నుంచి రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యజమాని తెలిపారు.
Updated Date - 2023-11-29T19:40:36+05:30 IST