ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP leader: తన మనసులో మాట చెప్పేసిన బీజేపీ సీనియర్ నేత.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:40 PM

పార్టీ అవకాశం ఇస్తే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి(Malkajigiri) ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy) పేర్కొన్నారు.

- పార్టీ అవకాశం ఇస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తా

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

మన్సూరాబాద్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పార్టీ అవకాశం ఇస్తే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి(Malkajigiri) ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy) పేర్కొన్నారు. ఎల్బీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన తాను 30.18శాతం ఓట్లు సాధించానన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు సాధించిన ఓట్ల శాతం కంటే.. ఎల్బీనగర్‌లోనే అధిక ఓట్ల శాతాన్ని పొందామన్నారు. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్ఠాన పెద్దలను కోరినట్లు రంగారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, నీళ్ల అంజన్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 01:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising