ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kasani Gnaneshwar : బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

ABN, First Publish Date - 2023-11-03T15:00:26+05:30

బీఆర్ఎస్‌ పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar Comments ) ముదిరాజ్ చేరారు. మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ( KCR ) వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ సమక్ష్యంలో జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకున్నారు.

సిద్దిపేట: బీఆర్ఎస్‌ పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar Comments ) ముదిరాజ్ చేరారు. మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ( KCR ) వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ సమక్ష్యంలో జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ జ్ఞానేశ్వర్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ్ఞానేశ్వర్‌తో పాటు ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక పదవీ ఇస్తానని కాసాని జ్ఞానేశ్వర్‌కు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...‘‘ముదిరాజ్ సామాజిక వర్గంలో నాయకత్వం ఎదగాలి. గెలిచే నాయకులను పార్టీ గౌరవిస్తుంది.. గెలవలేని పరిస్థితుల్లో కులాల వారీగా టికెట్లు ఇస్తే పార్టీ నష్టపోతుంది. పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించి సంగారెడ్డిలో గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌కు టిక్కెట్ ఇచ్చాం. చివరి వరకు పోరాడినా ఒడాం... మళ్లీ ఇప్పుడు ఆయనకే టిక్కెట్ ఇచ్చాం. ఎన్టీఆర్ హయాంలో బీసీల రిజర్వేషన్ ద్వారా కొంత ఎదిగారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ పార్టీలోంచి వెళ్లాక.. పార్టీలోకి వచ్చిన పెద్ద నేత మీరు.. పార్టీలో మీకు తగిన గౌరవం ఉంటుంది. ఎన్నికలు అయిపోయాక ప్రశాంతంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-03T15:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising