Haragopal : పదేళ్లల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలం
ABN, First Publish Date - 2023-11-15T18:46:33+05:30
గన్ పార్కు నుంచినిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది. యాత్రను ప్రొఫెసర్ హరగోపాల్ ( Haragopal ) ప్రారంభించారు.
హైదరాబాద్ : గన్ పార్కు నుంచినిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది. యాత్రను ప్రొఫెసర్ హరగోపాల్ ( Haragopal ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు. పదేళ్లల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా జరగలేదు. జరిపిన పరీక్షల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వ పాలన చూస్తే షాకింగ్ లాగా ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు పల్లెల్లోకి వెళ్లి ప్రజలకి వాస్తవాలు చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే’’ అని హరగోపాల్ తెలిపారు.
Updated Date - 2023-11-15T18:46:34+05:30 IST