Telangana Elections: రాజకీయ పార్టీలతో అడిషనల్ సీఈవో భేటీ.. ఎమ్‌సీసీపై చర్చ
ABN, First Publish Date - 2023-11-11T13:59:45+05:30
Telangana Elections: రాజకీయ పార్టీలతో అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్ శనివారం భేటీ అయ్యారు.
హైదరాబాద్: రాజకీయ పార్టీలతో (political parties) అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్ (Additional CEO Lokesh Kumar ) శనివారం భేటీ అయ్యారు. శనివారం బీఆర్కే భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct) ఉల్లంఘనపై పొలిటికల్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 426 ఎంసీసీ కేసులు నమోదు అయ్యాయి. ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , అభ్యర్థుల ఖర్చులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్‌సీసీ వైలేషన్‌లో అధికార పార్టీపై ఎక్కువగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈక్రమంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై నేతలకు అడిషనల్ సీఈవో దిశానిర్దేశం చేస్తున్నారు. నామినేషన్లు పూర్తి అవ్వడంతో ప్రచారంలో జరిగే ఎమ్‌సీసీపై చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-11-11T13:59:46+05:30 IST