ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics : కేసీఆర్ గుర్తుపెట్టుకో అని చెప్పిమరీ.. కేసీఆర్‌పై షా విమర్శనాస్త్రాలు

ABN, First Publish Date - 2023-08-27T17:10:15+05:30

ఖమ్మం వేదికగా జరుగుతున్న "రైతు ఘోష - బీజేపీ భరోసా" బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah) మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (Cm Kcr) విమర్శనాస్త్రాలు సంధించారు.

ఖమ్మం: ఖమ్మం వేదికగా జరిగిన "రైతు ఘోష - బీజేపీ భరోసా" బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah) మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (Cm Kcr) విమర్శనాస్త్రాలు సంధించారు.

"కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలి. కాంగ్రెస్‌, BRS.. రెండూ కుటుంబ పార్టీలే. కాంగ్రెస్‌ సోనియా కుటుంబం కోసం పనిచేస్తుంటే.. BRS కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోంది. కారు స్టీరింగ్‌ ఓవైసీ చేతుల్లో ఉంది. ఓవైసీతో కలిసి తెలంగాణ పోరాటయోధులను విస్మరించారు. తెలంగాణ అమరుల కలను బీఆర్ఎస్‌ నాశనం చేసింది. కేసీఆర్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ ఓడిపోతుంది. తెలంగాణలో త్వరలోనే కమలం వికసిస్తుంది." అని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు.


"కాంగ్రెస్‌ 4జీ పార్టీ, BRS 2జీ పార్టీ, MIM 3జీ పార్టీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోదీజీ పార్టీనే. అరెస్ట్‌లతో BJP నేతలను భయపెట్టొచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాలేరు. ఈసారి సీఎం అయ్యేది బీజేపీ నేత మాత్రమే. ఓవైసీ నడిపే కారు పార్టీని మళ్లీ గెలిపించొద్దు." అని అమిత్ షా తెలంగాణ ప్రజలను కోరారు.

Updated Date - 2023-08-27T17:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising