ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sania Mirza: విడాకుల పుకార్లకు ఆజ్యం పోస్తూ సానియామీర్జా ఇన్‌స్టాగ్రాంలో తాజా పోస్ట్

ABN, First Publish Date - 2023-02-08T08:32:47+05:30

భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోతున్నారనే వార్తలకు...

Tennis Star Sania Mirza
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోతున్నారనే వార్తలకు తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో( Instagram post) పెట్టిన సందేశం ఆజ్యం పోసినట్లయింది.(Sania Mirza Divorce Rumours)భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోతున్నారనే పుకార్ల మధ్య టెన్నిస్ స్టార్(Tennis Star) సానియా సోషల్ మీడియాలో(Social Media) క్రిప్టిక్ సందేశాన్ని పోస్ట్ చేశారు.(Posts Cryptic Message)

సానియా మీర్జా గత నెలలో తన చివరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడారు. తన భాగస్వామి రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు.సానియామీర్జా తన ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ ‘‘ఇది విశ్వాసం కోల్పోయే సమయం కాదు, విశ్వాసాన్ని పట్టుకునే సమయం’’ అని పేర్కొన్నారు., సానియా మీర్జా, ఆమె అమెరికన్ భాగస్వామి బెథానీ మాటెక్-సాండ్స్ అబుదాబి ఓపెన్ మొదటి రౌండ్‌లో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్, లారా సీగెమండ్ జోడీపై వరుస సెట్‌ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇది కూడా చదవండి : Layoff: ఈబేలో లేఆఫ్...500 మంది ఉద్యోగుల తొలగింపు

సోమవారం రాత్రి గంటా 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సానియా-బెథానీ జోడీ 3-6, 4-6తో బెల్జియం-జర్మన్ ప్రత్యర్థుల చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన సానియామీర్జా ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడి ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతున్నారు.2009వ సంవత్సరం నుంచి 2016 వరకు సానియా మీర్జా ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.మహిళల డబుల్స్ , మిక్స్‌డ్ డబుల్స్‌లో ఒక్కొక్కటి మూడు. 2015లో, ఆమె మహిళల డబుల్స్ ర్యాంకింగ్‌లో ప్రపంచ నంబర్ వన్ కూడా అయ్యారు.

Updated Date - 2023-02-08T09:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising