MS Dhoni: అలా అయితే పాకిస్తాన్ వెళ్లండి.. అభిమానికి ధోనీ సలహా.. వీడియో వైరల్!
ABN, Publish Date - Dec 31 , 2023 | 10:03 AM
క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. తన నాయకత్వం, ఆటతీరు, ప్రవర్తనతో ధోనీ ఎంతో మంది మనసులను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. తన నాయకత్వం, ఆటతీరు, ప్రవర్తనతో ధోనీ ఎంతో మంది మనసులను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Viral Video). వైరల్ అవుతున్న ఆ వీడియోలో ధోనీ ఓ వ్యక్తికి పాకిస్తాన్ (Pakistan) వెళ్లాలని సలహా ఇస్తున్నాడు.
ఆ వీడియో (Dhoni Video) ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో మాత్రం తెలియడం లేదు. ఆ వీడియోలో ధోనీ మాట్లాడుతూ.. ``మీరు మంచి భోజనాన్ని ఆస్వాదించాలనుకుంటే పాకిస్తాన్ వెళ్లండి`` అని సలహా ఇస్తున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోపై పాకిస్తాన్ స్పోర్ట్స్ యాంకర్ ఫకర్ ఆలం స్పందించారు. ``పాకిస్తాన్ ఆహారాన్ని ధోనీ ఇష్టపడడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. కేవలం క్రికెట్ కోసమే కాకుండా.. ఇక్కడి ఆహారం కోసం కూడా ధోనీ ఓసారి పాకిస్తాన్‌కు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా`` అని ట్వీట్ చేశారు.
తన కెరీర్ ఆరంభంలో 2006-08 మధ్యలో ధోనీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. తన అద్భుత ఆటతీరుతో టీమిండియాను గెలిపించి పాక్ క్రికెట్ అభిమానులను కూడా ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ కూడా ధోనీని ఎంతగానో ఇష్టపడ్డారు. ధోనీ హెయిర్ స్టైల్, సిక్స్‌లు కొట్టే తీరు తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 10:03 AM