ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pagal Hai Thoda: అతడికి కొద్దిగా పిచ్చి జాగ్రత్త!.. మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్

ABN, First Publish Date - 2023-02-10T16:08:24+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border–Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Astralia)తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు(Team India)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border–Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Astralia)తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు(Team India) పటిష్ఠ స్థితిలో నిలిచింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న టీమిండియా 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి ఆస్ట్రేలియా కంటే 105 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఓ ఫన్నీ ఇన్నిడెంట్ జరిగింది. 77వ ఓవర్‌లో రోహిత్(Rohit Sharma), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) క్రీజులో ఉన్నారు.

ఆ సమయంలో రోహిత్.. ‘‘అతడు నిజంగా పిచ్చోడు.. నిజం’’(Pagal Hai Thoda) అంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ఇప్పుడీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మార్నస్ లబుషేన్ బౌలింగులో జడేజా రెండో పరుగు తీయడానికి ప్రయత్నించాడు. అప్పుడు స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్న రోహిత్ అతడిని వారించాడు. బంతి స్మిత్(Smith) చేతిలోకి వెళ్లడంతో అతడిని ఉద్దేశించి జడేజాను వారిస్తూ.. ‘‘అతడికి కొద్దిగా పిచ్చి’’ అని వారించాడు. దీంతో రెండో పరుగు కోసం పిచ్‌పై అప్పటికే కొంత దూరం వచ్చేసిన జడేజా వెనక్కి వెళ్లాడు. రోహిత్ చేసిన ఈ ‘పిచ్చి’ వ్యాఖ్యలు అక్కడి స్టంప్‌లోని మైక్‌లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ సెంచరీ సాధించి అవుటయ్యాడు. మొత్తం 212 బంతులు ఎదుర్కొన్న రోహిత్15 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసి క్రీజులో ఉన్నాడు. ఓవర్ నైట్ స్కోరు 77/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు అశ్విన్ (23) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12), తొలి టెస్టు ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (8) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోయి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్ కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి 105 పరుగుల ఆధిక్యంతో ఉంది. జడేజా 57, అక్షర్ పటేల్ 22 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు.

Updated Date - 2023-02-10T16:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising