ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND Vs AUS: నాలుగో టీ20 జరిగే స్టేడియానికి పవర్ కట్.. అసలు ట్విస్ట్ ఇదే..!!

ABN, First Publish Date - 2023-12-01T16:13:03+05:30

Power Cut in Raipur Stadium: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 నిర్వహణ సందిగ్ధంలో పడింది. శుక్రవారం రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో నాలుగో టీ20 జరగనుంది. కరెంట్ బిల్ చెల్లించలేదనే ఆరోపణతో అధికారులు రాయ్‌పూర్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

సొంతగడ్డపై టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌లు జరగ్గా టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. శుక్రవారం రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో నాలుగో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరిగేది ఇప్పుడు అనుమానంగా మారింది. దీనికి కారణం వాతావరణం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కరెంట్ బిల్ చెల్లించలేదనే ఆరోపణతో రాయ్‌పూర్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 2009 నుంచి రూ.3.16 కోట్ల కరెంట్ బిల్లు నిర్వాహకులు చెల్లించని కారణంగా విద్యుత్ శాఖ అధికారులు రాయ్‌పూర్ స్టేడియానికి సరఫరా నిలిపివేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో నాలుగో టీ20 ప్రారంభ సమయానికి నిర్వాహకులు ఈ సమస్యను క్లియర్ చేస్తారో లేదో అంటూ క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ఐదేళ్లుగా రాయ్‌పూర్ స్టేడియంలో తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఉన్నప్పటికీ అది కేవలం ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీలు, బాక్సులకే సరఫరా అందిస్తోంది. ఒకవేళ విద్యుత్ శాఖ అధికారులు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు, ఇతర అవసరాల కోసం నిర్వాహకులు జనరేటర్ వాడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ సామర్థ్యాన్ని పెంచడానికి క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దరఖాస్తు చేశారని రాయ్‌పూర్ రూరల్ సర్కిల్ ఇన్‌చార్జి అశోక్ ఖండేల్వాల్ వెల్లడించారు. 1,000 KVకి అప్‌గ్రేడ్ చేయడానికి ఆమోదం లభించినా అమలు పెండింగ్‌లో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా రాయ్‌పూర్ స్టేడియానికి విద్యుత్ సమస్య కొత్త కాదని.. 2018లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హాఫ్ మారథాన్‌ కార్యక్రమం రద్దు చేశారు. 2009 నుంచి స్టేడియానికి సంబంధించిన కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T16:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising