ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs AUS: నాథన్ దెబ్బకొట్టినా అక్షర్ ఆదుకున్నాడు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు ఎంతంటే?

ABN, First Publish Date - 2023-02-18T16:29:52+05:30

ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ సేనకు అంతగా కలిసి రాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా(Australi)తో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు(Team India) తన తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ కంటే ఒక్క పరుగు వెనకబడింది. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ సేనకు అంతగా కలిసి రాలేదు. ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ (Nathan Lyon)దెబ్బకు భారత బ్యాటర్లు విలవిల్లాడారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ బెంబేలెత్తించాడు. తొలి నాలుగు వికెట్లను పడగొట్టి భారత్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.

అతడి దెబ్బకు 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)క్రీజులో పాతుకుపోయి వికెట్ల వేటకు అడ్డుకట్ట వేశాడు. కోహ్లీ క్రీజులో కుదురుకున్నప్పటికీ వికెట్ల పతనం ఆగలేదు. ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా (26) కూడా పెవిలియన్ చేరడంతో మొత్తం బాధ్యత కోహ్లీపై పడింది. ఈ క్రమంలో ఓ వివాదాస్పద ఎల్బీకి కోహ్లీ అవుటయ్యాడు. మొత్తం 84 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 44 పరుగుల చేశాడు.

మరోవైపు, తొలి టెస్టులో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్(Axar Patel) మరోమారు ఆపద్బాంధవుడయ్యాడు. ఆసీస్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కొని స్కోరును పెంచుతూ పోయాడు. రవిచంద్రన్ అశ్విన్(R.Ashwin) అతడికి అండగా నిలిచాడు. దీంతో వికెట్ల కోసం ఆసీస్ బౌలర్లు చెమటోడ్సాల్చి వచ్చింది. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఆసీస్‌కు ధీటుగా బదులిచ్చాడు.

37 పరుగులు చేసిన అశ్విన్.. కమిన్స్‌కు దొరికిపోగా 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసిన అక్షర్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 262 పరుగుల వద్ద షమీ బౌల్డ్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

74 పరుగులు చేసిన అక్షర్ పటేల్ టాప్ స్కోరర్‌గా నిలవగా, కోహ్లీ చేసిన 44 పరుగులు జట్టులో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అశ్విన్ 37, రోహిత్ 32, జడేజా 26 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. కాగా, అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది.

Updated Date - 2023-02-18T16:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising