ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team india: మూడు ఫార్మాట్లలో ఎంపికయ్యారు.. కానీ జట్టులో స్థానం లభించేనా?

ABN, First Publish Date - 2023-07-06T18:52:48+05:30

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే మూడు ఫార్మాట్లలో ఎంపికైన ఆటగాళ్లు కేవలం నలుగురే ఉన్నారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ ఉన్నారు. అయితే వీరిలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు మూడు ఫార్మాట్ల తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కానీ మిగతా ఇద్దరి పరిస్థితి మాత్రం వేరుగా ఉండనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ మేరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఆయా మ్యాచ్‌లకు సంబంధించి ఇప్పటికే సెలక్టర్లు జట్లను ప్రకటించారు. అయితే మూడు ఫార్మాట్లలో ఎంపికైన ఆటగాళ్లు కేవలం నలుగురే ఉన్నారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ ఉన్నారు. అయితే వీరిలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు మూడు ఫార్మాట్ల తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కానీ మిగతా ఇద్దరి పరిస్థితి మాత్రం వేరుగా ఉండనుంది.

అక్షర్ పటేల్ మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్నా జట్టులో చోటు మాత్రం డోలాయమానంగా ఉంది. టెస్టుల్లో రెగ్యులర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఉండగా మూడో స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్‌కు చోటు దక్కుతుందా అంటే అనుమానమే. సొంతగడ్డపై అయితే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది కానీ పేస్‌కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్‌లపై ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. వన్డేల్లోనూ చాహల్, కుల్‌దీప్ వంటి స్పిన్నర్ల పోటీని తట్టుకుని అక్షర్ పటేల్ తుది జట్టులో స్థానం సంపాదిస్తాడో లేదో చూడాలి. టీ20లలో జడేజా ఉండడు కాబట్టి బహుశా చాహల్‌తో పాటు అక్షర్ పటేల్ ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ గుడ్‌బై

ఇక ముఖేష్ కుమార్ విషయానికి వస్తే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అతడి ప్రదర్శన అంతంత మాత్రమే. కానీ ఈ బెంగాల్ పేసర్‌పై నమ్మకంతో సెలక్టర్లు జాతీయ జట్టులో స్థానం కల్పించారు. అనూహ్యంగా మూడు ఫార్మాట్లలోనూ ముఖేష్‌కు చోటు ఇచ్చారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ముఖేష్ ఐపీఎల్‌లో మాత్రం తేలిపోయాడు. మరి వెస్టిండీస్ పర్యటనలో అవకాశం వస్తే ఎలా రాణిస్తాడో చూడాలి. బుమ్రా, షమీ, భువనేశ్వర్ లాంటి సీనియర్లు లేని లోటును ముఖేష్ తీరుస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2023-07-06T18:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising