Tamim Iqbal: అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ గుడ్‌బై

ABN , First Publish Date - 2023-07-06T15:04:41+05:30 IST

బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. తమీమ్ ఇక్బాల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో కెరీర్ ప్రారంభించిన అతడు మూడు ఫార్మాట్లలో 15వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 14 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ కూడా ఉన్నాయి.

 Tamim Iqbal: అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ గుడ్‌బై

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రతిష్టాత్మకంగా జరగనుంది. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్‌మెంట్ బిత్తరపోయింది. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 100 రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో కెప్టెన్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడంతో పలువురు క్రికెటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రింకూ సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై విమర్శల వర్షం

ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడుతోంది. అయితే తొలి వన్డేలో బంగ్లాదేశ్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 43 ఓవర్లలో బంగ్లాదేశ్ 169 పరుగులు చేయగా వర్షం కారణంగా ఆప్ఘనిస్తాన్ లక్ష్యాన్ని కుదించారు. దీంతో 17 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఓడిన వెంటనే బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్‌ అయ్యారు.

తమీమ్ ఇక్బాల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో కెరీర్ ప్రారంభించిన అతడు మూడు ఫార్మాట్లలో 15వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 14 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ కూడా ఉన్నాయి.

రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తమీమ్ ఇక్బాల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడితో తన కెరీర్ ముగిసిందని.. ఇప్పటివరకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని.. తనకు అండగా నిలిచిన బీసీబీ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశాడు. 16 ఏళ్లుగా తనను సపోర్ట్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితంలో తదుపరి అధ్యాయం కూడా సవ్యంగా సాగేలా ప్రార్థించాలని అభిమానులను కోరాడు. కాగా తమీమ్ ఇక్బాల్ వారసుడి రేసులో లిట్టన్ దాస్, షకీబుల్ హసన్ ఉన్నారు.

Updated Date - 2023-07-06T15:07:24+05:30 IST