ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pat Cummins: అహ్మదాబాద్ టెస్టుకూ కమిన్స్ దూరం!

ABN, First Publish Date - 2023-03-06T20:58:35+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్‌(Team India)తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్‌(Team India)తో జరగనున్న చివరి టెస్టుకు కూడా ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) దూరమయ్యాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో రెండో టెస్టు ముగిసిన వెంటనే కమిన్స్ స్వదేశానికి వెళ్లిపోయాడు. మూడో టెస్టు ప్రారంభం నాటికి జట్టులో చేరుతాడని భావించినప్పటికీ తల్లికి చికిత్స కొనసాగుతుండడంతో రాలేకపోయాడు. దీంతో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్(Steven Smith) జట్టును నడిపించాడు. తొలి రెండు టెస్టుల్లోనూ దారుణంగా ఓడిన పర్యాటక జట్టు మూడో టెస్టులో మాత్రం భారత్‌ను మట్టికరిపించి ఘన విజయం సాధించింది.

ఇక, ఈ నెల 9 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌(Ahmedabad Test)లో జరగనున్న చివరి టెస్టుకు కూడా కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. తల్లికి ఇంకా చికిత్స జరుగుతుండడంతో కమిన్స్(Cummins) ఆమె వద్దే ఉన్నాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు కూడా స్మిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని ఆసీస్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

మూడో టెస్టులో ఓడిన భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. చివరి టెస్టులో కనుక విజయం సాధిస్తేనే టీమిండియా ఫైనల్ చేరుకుంటుంది. లేదంటే శ్రీలంక-న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది.

Updated Date - 2023-03-06T21:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising