ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World Cup 2023: ఆ ప్లేయర్లను ఐపీఎల్ ఆడొద్దని చెప్పేసిన బీసీసీఐ

ABN, First Publish Date - 2023-01-01T20:59:06+05:30

ఈ ఏడాది భారత్‌లో జరగనున్నవన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ (BCCI) సిద్ధమవుతోంది. ఇందుకోసం 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. గాయాల బారినపడకుండా ఉండేందుకు ఐపీఎల్(IPL) ఆడొద్దంటూ టాప్ ప్లేయర్లను

Team India
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఈ ఏడాది భారత్‌లో జరగనున్నవన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ (BCCI) సిద్ధమవుతోంది. ఇందుకోసం 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. గాయాల బారినపడకుండా ఉండేందుకు ఐపీఎల్(IPL) ఆడొద్దంటూ టాప్ ప్లేయర్లను ఆదేశించింది. ఐసీసీ ఈవెంట్లపై దృష్టి పెట్టడంతోపాటు ఆటగాళ్లు గాయాల బారినపడకుండా ఉండాలన్న ముందు జాగ్రత్తతోనే బీసీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని ఓ సెవన్ స్టార్ హోటల్‌లో జరిగిన బీసీసీఐ పెర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఎన్‌సీఏ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman), మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Shrama) సమావేశానికి హాజరు కాగా, బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ(Roger Binny) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. టీమిండియా ఈ ఏడాది 35 వన్డేలు ఆడనుంది. ఇందులో భాగంగా తొలుత శ్రీలంకతో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది.

2022లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించేందుకే ఈ సమావేశం నిర్వహించారు. గతేడాది జరిగిన ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ రెండింటిలోనూ భారత్ దారుణంగా విఫలమైంది. కాగా, ఈ సమావేశంలో.. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ (One Day World Cup) రూట్‌మ్యాప్, అందుబాటులో ఉండే ఆటగాళ్లు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ వంటివాటిపై చర్చించినట్టు బీసీసీఐ తెలిపింది.

Updated Date - 2023-01-01T21:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising